"అల్లుడు సింగం` సినిమాలో సరికొత్త గ్లామర్ లుక్‌తో అంజలి..
- November 07, 2016
సత్యదేవ పిక్చర్స్ బ్యానర్‌పై విమల్, అంజలి జంటగా రూపొందుతోన్న మాస్ ఎంటర్టైనర్ `అల్లుడు సింగం`. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రావిపాటి సత్యనారాయణ ` విడుదల చేస్తున్నారు. షాపింగ్ మాల్, జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అంజలి తెలుగు, తమిళ సినీ రంగాల్లో హీరోయిన్గా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లవ్‌స్టోరీగా రూపొందుతో్న్న "అల్లుడు సింగం` సినిమాలో సరికొత్త గ్లామర్ లుక్‌తో ఇప్పటి వరకు మరే సినిమాలో చేయని రెండు డిఫరెంట్ రోల్స్ లాయర్, పొలిటీషియన్‌గా కనపడనుంది. అంజలి చేసిన రెండు షేడ్స్ సినిమాకు పెద్ద హైలైట్ కానుంది.లవ్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాధారవి నటన, కమెడియన్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్ నెలాఖరున విడుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రావిపాటి సత్యనారాయణ తెలియజేశారు.
ఈ చిత్రానికి సంగీతంః ఎన్.ఆర్.రఘునందన్, మాటలుః వెంకట్, నిర్మాతః రావిపాటి సత్యనారాయణ, దర్శకుడుః రాజశేఖర్
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







