బంగారం ధర పడిపోయింది
- November 07, 2016
గత ఐదు ట్రేడింగ్ల్లో పెరుగుతూ వచ్చిన బంగారం ధర సోమవారం తగ్గింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.300 తగ్గి రూ.31వేల దిగువకు పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సానుకూలంగా ఉంటాయన్న సంకేతాలు బంగారం తగ్గుదలకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా డాలర్ మరింత బలపడనుందన్న అంశం కూడా బంగారం తగ్గుదలకు కారణమైంది. దేశ రాజధానిలో 10గ్రాముల పసిడి రూ.30,700గా పలుకుతోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి ఎఫ్బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో మార్కెట్లు సైతం సానుకూలంగా స్పందించాయి.మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసింది.కిలో వెండి ధర రూ.450 తగ్గి రూ.43,600 పలికింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణమని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







