యూఏఈ ట్రాఫిక్ లా ఎన్ఫోర్స్మెంట్ని ఆకర్షించిన న్యూ స్పీడ్ కెమెరా
- November 07, 2016
అబుదాబీ: పోర్టబుల్ స్పీడ్ కెమెరాలు, భవిష్యత్తులో యూఏఈ మోటరిస్టులకు షాక్ ఇవ్వనున్నాయి. పోలీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ కెమెరాలను త్వరలో యూఏఈలో అమర్చనున్నారు. ఫ్రెంచ్ ఇంటీరియర్ మినిస్ట్రీ 250 కొత్త స్పీడ్ కెమెరా యూనిట్లను 2018 చివరినాటికి తమ రోడ్లపై ఇన్స్టాల్ చేయనుంది. జర్మనీ, లగ్జెంబర్గ్ మరియు స్పెయిన్ కూడా ఈ డివైజెస్ని పరీక్షించింది. గత నెలలో జరిగిన ఎక్స్పోలో ఈ న్యూ స్పీడ్ కెమెరా గురించి యూఏఈ ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాల్ని, హార్డ్ షోల్డర్ డ్రైవింగ్ చేసేవాటినీ, అలాగే షడెన్ లేన్ ఛేంజ్ వెహికిల్స్నీ ఈ న్యూ స్పీడ్ కెమెరా కనిపెట్టేస్తుంది. తక్షణం సమాచారాన్ని కంట్రోల్ రూమ్కి అందించడం ఈ కెమెరాల ప్రత్యేకత. ఎలాంటి ఛార్జింగ్ అవసరం లేకుండా ఏకధాటిగా ఐదు గంటల పాటు పనిచేయడం ఈ కొత్త కెమెరా వ్యవస్థ (రాడార్) ప్రత్యేకతగా మేకర్స్ వివరిస్తున్నారు. అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో గత నెలలో జర్మన్ కంపెనీ విట్రానిక్, ఫ్రెంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ కోజెలెక్ ఈ వ్యవస్థను ప్రదర్శించాయి.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







