అపరిశుభ్రత: మసాజ్ పార్లర్లకు జరీమానా
- November 07, 2016
దుబాయ్: పెద్ద సంఖ్యలో మసాజ్ సెంటర్స్, దుబాయ్ మునిసిపాలిటీ పరిధిలో జరీమానాకి గురయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యల్ని దుబాయ్ మునిసిపాలిటీ తీసుకుంది. 330 జరీమానాల విలువ మొత్తం 749,000 దిర్హామ్‌లుగా అధికారులు వెల్లడించారు. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మొత్తం 930 తనిఖీలు ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగాయి. జరీమానాలకు తోడు 561 వార్నింగ్స్ కూడా ఇచ్చారు అధికారులు. అపరిశుభ్రతే ఈ ఉల్లంఘనల్లో ముఖ్యమైనదని హెల్త్ కంట్రోల్ సెక్షన్ హెడ్ హఫిద్ గులూమ్ చెప్పారు. ఫిజియోథెరపీ, ఇతర మెడికల్ సర్వీసులు నిర్వహించడం ప్రధాన ఉల్లంఘన. మసాజ్ సెంటర్లు ఎలాంటి మెడికల్ సర్వీసులను అందించడానికి వీల్లేదని గులూమ్ వివరించారు. సాధారణ పరిశుభ్రత లేని మసాజ్ పార్లర్లకు 400 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. ప్లంబింగ్, డ్రైనేజ్ వంటి సమస్యలున్న పార్లర్లకు 1000 దిర్హామ్‌ల జరీమానా విధించారు. బ్యూటీ సెలూన్ కూడా మసాజ్ సెంటర్‌లా పనిచేయకూడదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







