సినిమా షూటింగ్లో ఇద్దరు స్టంట్ మాస్టర్లు మృతి
- November 07, 2016
శాండిల్‌వుడ్‌లో ఓ షూటింగ్లో పెను విషాదం చోటుచేసుకుంది. మస్తిగుడి అనే సినిమాలో కీలకమైన ఫైటింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఇద్దరు నటులు దుర్మరణం పాలయ్యారు. హీరోతోపాటు ఇద్దరు విలన్లు
హెలికాఫ్టర్ నుంచి నీళ్లలోకి దూకే సీన్ తీస్తుండగా ఈ ఘటన చేటుచేసుకుంది. లక్కీగా హీరో దునియా విజయ్ ప్రాణాలతో బయటపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఐతే.. ఈ సీన్లో స్టంట్మెన్తోపాటు విలన్‌గా చేస్తున్న నటుడు నీళ్లలో మునిగి చనిపోయారు. వీళ్లిద్దినీ అనిల్, ఉదయ్‌గా గుర్తించారు.
తిప్పగొండనహళ్లి డ్యామ్‌లో ఈ మస్తిగుడి షూటింగ్ జరుగుతోంది. ఓ సీన్లో భాగంగా హీరోతోపాటు విలన్లు హెలికాఫ్టర్ నుంచి రిజర్వాయర్ నీళ్లలోకి దూకాలి. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకాలి. ఐతే.. ఈ షూటింగ్ సందర్భంగా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. తాళ్లవంటివి ఏమీ లేకుండా డైరెక్ట్‌గా 100 అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. డూప్ లేకుండా స్టంట్స్ చేశామని చెప్పుకునేందుకు సినిమా యూనిట్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







