భారత రాయబార కార్యాలయాల వెబ్‌సైట్లు హ్యాక్
- November 07, 2016
భారత రాయబార కార్యాలయాలకు చెందిన ఏడు వెబ్‌సైట్లు సోమవారం హ్యాక్ అయ్యాయి. దక్షిణ ఆఫ్రికా, లిబియా, మలావీ, మాలి, ఇటలీ, స్విట్జర్లాండ్, రొమేనియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వెబ్‌సైట్లు హ్యాక్ అయ్యాయి. ఈ దేశాల్లో పని చేస్తున్న సుమారు 800 మంది భారత అధికారుల వ్యక్తిగత వివరాల డేటా చోరీ చేసినట్లు నెదర్లాండ్‌కు చెందిన ఇద్దరు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
భారతీయ అధికారుల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్లు, పాస్‌పోర్ట్ నెంబర్లు, వెబ్‌సైట్ల అడ్మిన్, లాగిన్ వివరాలను పేస్ట్‌బిన్.కామ్‌లో బహిర్గతం చేశారు. అయితే ఆ వెబ్‌సైట్ నిర్వాహకులు ఆ డేటాను తర్వాత తొలగించారు. భారత రాయబార కార్యాలయాల వెబ్‌సైట్ల సెక్యూరిటీ డొల్లతనాన్ని బయట పెట్టేందుకే తాము హ్యాకింగ్ చేసినట్లు గ్రేహ్యాట్స్‌గా చెబుతున్న ఇద్దరు వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!







