విమానానికి బాంబు బెదిరింపు భారీ జరిమానా, 6 నెలల శిక్ష
- November 07, 2016
విమానంలో బాంబు ఉందని హెచ్చరించిన భారతీయుడికి రూ.34 లక్షలు జరిమానా వడ్డించడంతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. జెనీవా పోలీసు చీఫ్ ఫ్రాంకోయీస్ వారిడెల్ మాట్లాడుతూ గత నెలలో స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఉంటున్న వ్యక్తి జెనీవా విమానాశ్రయంలో విమానం బయల్దేరే సమయానికి చేరుకోలేకపోవడంతో ఆ విమానంలో బాంబు ఉందని హెచ్చరించాడని తెలిపారు. దీంతో ఆ విమానంలో తనిఖీలు నిర్వహించేందుకు 101 మంది పోలీసు అధికారులు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లు శ్రమించారని పేర్కొన్నారు. 116 మంది ప్రయాణికులు విమానం నుంచి దిగిపోవాల్సి వచ్చిందన్నారు. విమానం చాలా ఆలస్యంగా బయల్దేరిందని పేర్కొన్నారు.నిందితుడు భారతదేశం వెళ్ళడానికి వీలుగా జెనీవా విమానాశ్రయంలో విమానం ఆలస్యమవ్వాలన్న లక్ష్యంతో ఈ ఉత్తుత్తి హెచ్చరిక చేశాడన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







