విమానంలో విషసర్పం
- November 07, 2016
విమానంలో విషసర్పం...ఇదేదో సినిమా టైటిల్ కాదు...పచ్చినిజం. మెక్సికోకు చెందిన ఓ విమానంలో పాము కనిపించింది. దీన్ని చూసిన ప్రయాణికులు హడలెత్తిపోయారు. టోర్రెన్ నుంచి మెక్సికో వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడి సీటుపై పాము కనిపించింది. లగేజ్ కంపార్ట్‌మెంట్ నుంచి గ్రీన్‌రెప్‌టైల్‌కు పాము రావడాన్ని చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. దాదాపు మూడ మీటర్లు ఉన్న ఈ విషసర్పం తప్పించుకోకుండా దానిపై బ్లాంకెట్లు వేశారు. దీంతో పాము బ్లాంకెట్ల మధ్యే చిక్కుకుపోయింది. పాము సంగతి తెలుసుకున్న పైలెట్లు వెంటనే మెక్సికో ఎయిర్‌పోర్టుకు సమాచారం అందించారు. పది నిమిషాల్లో విమానం మెక్సికో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.అక్కడే సిద్ధంగా ఉన్న యానిమల్ కంట్రోల్ వర్కర్లు పామును పట్టేశారు. దీంతో ప్రయాణికులకు టెన్షన్ తగ్గింది. అయితే మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. విమానంలో పాము ఎలా దూరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







