ఐరాస బృందాలు అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించాయి..
- November 07, 2016
ఐక్యరాజ్యసమితి ( ఐరాస ) బృందాలు సోమవారం అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించాయి.అమెరికా సంకీర్ణదళాలు ఈనెల 4న జరిపిన వైమానిక దాడుల్లో 32 మంది పౌరులు మృతి చెందగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పౌర మరణాల పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలతో పాటు పలు స్థానిక స్వచ్ఛంధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈమేరకు ఐరాసలో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఐరాస సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో, ఐరాస బృందాలు అఫ్ఘాన్‌లో పర్యటించాయి. బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించినట్టు యూఎన్ఏఎంఏ ( అఫ్ఘాన్‌లో ఐరాస సహాయక మిషన్ ) పేర్కొంది.
ఇదిలా ఉండగా, అమెరికా సంకీర్ణదళాలు అఫ్ఘాన్‌లో నిర్వహిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక అపరేషన్ కారణంగా సామాన్య పౌరులు మృతి చెందుతున్నారు. గతేడాది అక్టోబర్ 3న, కుందూజ్లోని మెడిసిన్స్ శాన్ ఫ్రంటీర్స్ ఆస్పత్రిపై యూఎస్ సంకీర్ణదళాలు వైమానిక దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 42 మంది మృతి చెందారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
ఉద్దేశపూర్వకంగా తామీ దాడికి పాల్పడలేదని, పౌర మరణాల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. పౌర మరణాలు ఆందోళనకరం : అఫ్ఘాన్‌లో పౌర మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఐరాస ప్రకటించింది. జనవరి నుంచి జూన్ నెలఖారు వరకు 1,601 మంది పౌరులు మృతి చెందగా, మరో 3,565 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. అఫ్ఘనిస్తాన్‌లో చొరబాటు కోసం ప్రయత్నిస్తున్న తాలిబన్ల కారణంగా 60 శాతం మృతిచెందినట్టు నిర్ధారించింది.
తాజా వార్తలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!







