హైదరాబాద్ లో ఉచిత పార్కింగ్ సౌకర్యానికి మంగళం
- November 08, 2016
హైదరాబాద్ నగరంలోని వీధుల్లో వచ్చే ఏడాది నుంచి రోడ్ల పక్కన వాహనాల ఉచిత పార్కింగ్ సౌకర్యానికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు మంగళం పాడాలని నిర్ణయించుకున్నారు. రోడ్ల పక్కన ఖాళీ ప్రాంతాల్లో ఇంటలిజెంట్ పెయిడ్ పార్కింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ పార్కింగ్ లాట్స్ లలో పార్కింగ్ స్థలాన్ని ముందుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ సౌకర్యం కల్పించనున్నారు. నగరంలో 41,000 బైక్ లు, 15,000 కార్లను పార్కింగ్ చేసుకునేలా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా స్థలాలను గుర్తించారు. ఈ పార్కింగ్ స్థలాల్లో వాహనాల పార్కింగ్ కోసం డబ్బులు ఆన్ లైన్ లో చెల్లించేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.పార్కింగ్ స్థలాల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేయకుండా ఉండేలా ఆటోమేటిక్ టికెట్ మిషన్ ను ఏర్పాటుచేయాలని నగరవాసులు కోరుతున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి, వాటిని ప్రైవేటు వారికి అప్పగించాలని నిర్ణయించారు. నిర్దేశించిన దాని కంటే అధికంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







