తెలంగాణ మూడు వ దఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల..
- November 08, 2016
తెలంగాణ ప్రభుత్వం మరోదఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రూ.2019.19కోట్ల నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు దశల్లో నిధులు విడుదల చేయగా ఇవి మూడో దశలో రెండో విడత రుణమాఫీ నిధులుగా ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.17వేల కోట్లు రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రుణాలను నాలుగేళ్లలో చెల్లించాలని, ఏటా రూ.4250 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో మొదటి ఏడాది ఒకేసారి రూ.4250 కోట్లు విడుదల చేశారు. రెండో ఏడాది నుంచి రెండు దశల్లో రుణాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. గతేడాది సెప్టెంబర్ లోపే చెల్లించగా ఈ సంవత్సరం కొంత ఆలస్యమైంది.
మొదటి దఫా కింద రూ.2100కోట్లను విడుదల చేయగా మిగిలిన బకాయిలను ఈరోజు విడుదల చేసింది. మొత్తం రూ.2019.19కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. వచ్చే సంవత్సరం మాత్రం ఒకే దఫాలో జులై నెలలోనే రూ.4250కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







