ఓ మలయాళీ హీరోయిన్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది..
- November 08, 2016
ఓ మలయాళీ హీరోయిన్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కొద్ది రోజుల క్రితం కేరళలో అమలా అనే సీరియల్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుపడింది. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా రావటంతో అంతా హీరోయిన్ అమలా రోజ్ కురియన్ పోలీసులకు పట్టుబడినట్టుగా భావించారు. సోషల్ మీడియాలో అదే ప్రచారం జరగటంతో అమలా రోజ్ కురియన్ త్రీవంగా స్పందించింది.పోలీసులకు పట్టుబడింది తాను కాదంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో క్లారిటీ ఇచ్చిన అమలా రోజ్ కురియన్, ఈ వార్త ప్రచారం చేస్తున్న వారు తన ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. 'మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిని నేను.. కేవలం నటన మీద ఆసక్తితోనే ఈ రంగంలో కొనసాగుతున్నా.. కానీ ఇలాంటి వార్తల వల్ల, ఆ ఆసక్తి తగ్గిపోతుంది.దయచేసి నన్ను అపార్థం చేసుకునే వార్తలను ప్రచారం చేయకండి. ఈ వార్తల మూలంగా గత వారం రోజులుగా నాకు నిద్ర కూడా పట్టడం లేదు' అంటూ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







