'పవన్' సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ 'థమన్' కి సంతోషం....
- November 08, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మస్తు జోరుగా మీదున్నాడు. వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడని టాక్. ఓ చిత్రం షూటింగ్ లో ఉండగానే మరో చిత్రానికి సైన్ చేసేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' తో సినిమా చేయడానికి 'పవన్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొన్ననే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. తాజాగా తమిళ దర్శకుడు 'ఆర్ టి నేసన్' డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'తమన్' ఎంపిక చేశారు.ఈ విషయాన్ని స్వయంగా 'థమన్' ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. 'పవన్' సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కడంపై 'థమన్' సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







