మల్టీ స్టారర్ సినిమాలకు ఆదరణ..
- November 08, 2016
మల్టీ స్టారర్ సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. జూనియర్, సీనియర్ హీరోలు కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇటీవల ఊపిరి, జ్యో అచ్యుతానంద లాంటి మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించగా, తాజాగా ఐదుగురు హీరోలతో ఓ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్ చేశారు. భలే మంచిరోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా ఇందులో నాగ శౌర్య, నారా రోహిత్, సందీప్ కిషన్ లు హీరోలుగా నటించనున్నారట. ఇంక మరో ఇద్దరు హీరోలను వెతికే పనిలో ఉందట యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనం కొత్తగా అనిపించడంతో హీరోలు కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోండగా త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







