కార్ కేర్: మస్కట్ బిజినెస్‌మేన్ యూనిక్ ఐడియా
- November 08, 2016
మస్కట్: రువికి చెందిన బిజినెస్ మేన్ నజీబ్ రెహిమెన్ కొత్తగా ఆలోచించారు. ఓ చిన్న ఐడియా తనను వినూత్నమైన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేలా చేసిందంటారాయన. సాధారణంగా విదేశాలకు వెళ్ళేటప్పుడు సొంత కార్లను ఇంట్లోనో, లేదంటే విధిలేని పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ప్లేస్‌లోనే ఉంచేస్తుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ అవి దుమ్ముపట్టిపోతాయి. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపించారు నజీబ్ రెహిమాన్. 1800 గజాల స్థలంలో 200 కార్లు పట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఒక్కో రోజుకి కారుకి 3 ఒమన్ రియాల్స్ అద్దె వసూలు చేస్తారు. నెలకు 50 దిర్హామ్‌లు ఛార్జ్ చేస్తున్నారు. వాహనాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, బ్యాటరీ డౌన్ అయిపోకుండా ఓ సారి వాహనాన్ని స్టార్ట్ చేయడం వంటివి జరుగుతుంటాయి. వాహన యజమాని విదేశాల నుంచి తిరిగొచ్చేటప్పుడు అతనికి వాహనాన్ని పువ్వుల్లో పెట్టి అందించేస్తారు. ఎయిర్ పోర్ట్ పికప్ మరియు డ్రాపింగ్ సౌకర్యం కూడా కన్పిస్తున్నారు. రువిలోని ఓసి సెంటర్ సెకెండ్ ఫ్లోర్‌లో కార్ కేర్‌ని ఏర్పాటు చేశారు నజీబ్ రెహిమాన్.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







