రొయ్యల వేటపై నిషేధం లేదు
- November 08, 2016
మనామా: అధికారికంగా రొయ్యల వేటపై ఎలాంటి నిషేధం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వర్క్స్ మరియు మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ ఈ మేరకు స్పష్టతను ఇచ్చింది. అయితే చేపల వేట, రొయ్యల వేటకు సంబంధించి కొన్ని విధానాలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనలు మాత్రం పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 150 కిలోల బరువైన వలల్ని చేపలు, రొయ్యల వేట కోసం వినియోగిస్తుండడం వల్ల చిన్న చిన్న సముద్ర జీవులు మృత్యువాత పడ్తున్నాయనీ తద్వారా అపారమైన సముద్ర సంపద నాశనమవుతోందనే ఫిర్యాదుల మేరకు ఈ ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఫిషర్‌మెన్ ప్రయోజనాలు దెబ్బతినకుండా, సముద్ర పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అధికారులు. ప్రపంచ స్థాయిలో దీనికి సంబంధించిన అనుసరిస్తున్న పద్ధతులు, వాటిలో మెరుగైన విధానాల గురించి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో చేపల వేట లేదా రొయ్యల వేట సముద్రంలో కొనసాగిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతుండడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







