నంబర్ 15 నుంచి 6వ ధోవ్ ఫెస్టివల్
- November 08, 2016
దోహా: కటారా ట్రెడిషనల్ ధోవ్ ఫెస్టివల్ సరికొత్తగా సిద్ధమవుతోంది. నవంబర్ 15 నుంచి 19 వరకు కటారా బీచ్‌లో ఈ ఫెస్టివల్ జరగనుంది. 6వ ధోవ్ ఫెస్టివల్‌ని కొత్త కాంపిటీషన్స్‌తో, అదనంగా పార్టిసిపెంట్స్‌తో నిర్వహఙంచనున్నట్లు కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇహ్రీమ్ అల్ సులైటి చెప్పారు. ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని సూచనల మేరకు ఈ ఫెస్టివల్‌ని నిర్వహించనున్నారు. డైవింగ్, స్పిన్నింగ్, రోవింగ్, హడాక్, అల్ లుఫా కాంపిటీషన్స్తోపాటుగా మరో రెండు ట్రెడిషనల్ కాంపిటీషన్లు ఈ ఏడాది ప్రధాన ఆకర్షణ కానున్నాయి. బోట్ లాంఛింగ్ మరియు అల్ నహ్మా దేశానికి చెందిన మెరిటైమ్ హెరిటేజ్‌ని ప్రతిబింభిస్తాయి. జిసిసి జాతీయులందరికీ ఈ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది. కటారా బీచ్ మేనేజ్మెంట్ బిల్డింగ్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడ్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







