వలసదారుల వీసా పెంపు: వేరేదారిలేదు
- November 08, 2016
మస్కట్: మజ్లిస్ అల్ షురా సభ్యుడు తౌఫిక్ అల్ లవాతి మాట్లాడుతూ, వలసదారుల వీసా ఫీజుల్ని పెంచడం తప్ప ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో దేశానికి ఇంకో మార్గం లేదని చెప్పారు. అలాగే తాజా నిర్ణయాలతో సేవలు, వస్తువుల ధరలు పెరగడం వ్యక్తిగతంగా తనకూ ఇష్టం లేకపోయినా, పరిస్థితులు అనుకూలించని కారణంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఎకనమిక్ ప్యానెల్ సభ్యుడు కూడా అయిన తౌఫిక్ అల్ లవాతి దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని, వాటిని అనుసరించి నడచుకోవాల్సి వస్తోందని ఓసిసిసై మెంబర్ అహ్మద్ అల్ హూటి వ్యాఖ్యానించడం జరిగింది. సాధారణ ప్రజలు కొన్ని ఇబ్బందులు భరించాల్సిందేనని వివరించారు. పన్నుల పెంపు కారణంగా వ్యాపార వర్గాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఒమన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసలే కుదేలైన ఆర్థిక రంగం కారణంగా సామాన్యులు ఇబ్బంది పడితే, అన్ని వర్గాలపైనా ప్రభావం కనిపిస్తుందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేశారు. 2016 వాస్తవ బడ్జెట్‌ని 11.9 బిలియన్లు కాగా, రెవెన్యూస్ కేవలం 8.6 బిలియన్ ఒమన్ రియాల్స్ మాత్రమే ఉంది. పెట్రోల్, డీజిల్ సబ్సిడీల ఎత్తివేత సహా అనేక చర్యలు తీసుకోవడం ద్వారా లోటు భర్తీకి ప్రభుత్వం కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







