ఎడారి దేశం లో 'స్వాతంత్రం'
- August 27, 2015
స్వాతంత్రం లేదిక్కడా
సంతోషం లేదిక్కడా
ఐన వారందరినొదిలి
నరకయాత్రానుభవిస్తు
చావలేక,బ్రతుకలేక
ఎడారి దేశంలో ఎండుతున్నాం
ఐనవారు గుర్తొచ్చి కన్నీరు కారుస్తున్నాం..
తెలంగాణ గడ్డపై బ్రతుకు త్రోవలేక
గుడ్డలేసుకున్న మేము గొడ్డుకన్న--
హీనంగా బ్రతుకుతున్నామిక్కడా..
అన్న కేసి ఆర్ గారు
మా బ్రతుకులు మారుస్తావని
మా కన్నీరు తీరుస్తావని
మిమ్మల్ని గెలిపించుకున్నాం...
ఆదుకో ఆదుకో
ఈ అన్నదమ్ములను
మా గల్ఫ్ బ్రతుకులకు
బంగారు బాట వేసి
మరో మహాత్మునిగా
మా గుండెల్లో నిలిచిపో...
జై తెలంగాణ!!
జై జై తెలంగాణ!!
(దయచేసి గల్ఫ్ లో బ్రతుకుతున్న మమ్మల్ని
మనుషులుగా మరియు భారత పౌరులుగా గుర్తించి,
నా తల్లి భరత వాణిలో ఊపాది కలిపిస్తారని)
ఆశిస్తు...
జై హింద్!!
~శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







