రానున్న 'రఘువరన్ బీటెక్' సీక్వెల్
- November 09, 2016
ధనుష్ కథానాయకుడిగా 2014లో విడుదలై ఘన విజయం సాధించిన 'రఘువరన్ బీటెక్' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని 'వీఐపీ 2' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నట్లు ధనుష్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ప్రకటించారు. డిసెంబరులో చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుపుతూ. పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి కథ-డైలాగ్స్ ధనుష్, దర్శకత్వం-స్క్రీన్‌ప్లే సౌందర్య రజనీకాంత్. కథానాయిక, మిగిలిన చిత్ర బృందం సమాచారం తెలియాల్సి ఉంది. 'రఘువరన్ బీటెక్' చిత్రానికి వేల్రాజ్ దర్శకత్వం వహించారు. నిరుద్యోగిగా ఉన్న గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎలా సక్సెస్ఫుల్ సివిల్ ఇంజనీర్ అయ్యారనే కథతో నిర్మించిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయికగా నటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







