ఓవర్‌సీస్ లేబర్ కార్యాలయాలు
- November 09, 2016
జెడ్డా: సౌదీ ప్రభుత్వం, ప్రపంచంలోని పలు దేశాల్లోని తమ ఎంబసీలకు అనుబంధంగా లేబర్ కార్యాలయాల్ని తెరిచేందుకు సమాయత్తమవుతోంది. ఈజిప్ట్, ఇండియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, శ్రీలంక తదితర దేశాల్లో ఈ కార్యాలయాల్ని తెరిచేందుకు వీలుగా క్యాబినెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. స్టాండింగ్ కమిటీ - కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అండ్ డెవలప్‌మెంట్ రికమండేషన్స్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. లేబర్ రెగ్యులేషన్స్‌పై అవేర్‌నెస్ పెంచడమే ఈ కార్యాలయాల స్థాపన ముఖ్య ఉద్దేశ్యం. ఈ నిర్ణయంతో రిక్రూట్‌మెంట్‌లు సజావుగా సాగుతాయని, బ్రోకర్స్ నుంచి కార్మికులకు వెసులుబాటు కలుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ వర్గాలు వెల్లడించాయి. పైన పేర్కొన్న దేశాల నుంచి ఎక్కువగా సౌదీ అరేబియాకి కార్మికులు వస్తుంటారు. వీరిలో చాలామంది బ్రోకర్ల కారణంగా నష్టపోతున్నారు. తద్వారా ఒక్కోసారి సౌదీ అరేబియా కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రైవేట్ సెక్టార్ సైతం ఈ అక్రమ రిక్రూట్‌మెంట్లతో సమస్యలను ఎదుర్కొంటున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఎకనమిక్ ఎక్స్‌పర్ట్స్ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి కూడా ప్రభుత్వానికి అభినందనలు వస్తున్నాయి. కార్మికులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







