విక్రమ్ నెక్ట్స్ సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో
- November 10, 2016
కొంతకాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు స్పీడు పెంచాడు. ఇటీవల ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్, అదే జోరును కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే వరుసగా సినిమాలు అంగకీరిస్తూ ఫాం కొనసాగించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్న విక్రమ్ మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టాడు.
త్వరలో హరి దర్శకత్వంలో సామి సినిమాకు సీక్వల్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా తరువాత తన స్వీయ దర్శకత్వంలో హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా డోంట్ బ్రీత్ ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు.
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 2017లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







