మహేష్‌బాబు, కొరటాల శివ రిపీట్ ...
- November 10, 2016
'శ్రీమంతుడు' సూపర్‌హిట్ సినిమా కాంబినేషన్ మహేష్‌బాబు, కొరటాల శివ మరోసారి రిపీట్ అవుతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్.ఎల్.బి. పతాకాలపై రూపొందే ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్ కొట్టగా, మరో సీనియర్ నిర్మాత డి.సురేష్‌బాబు కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలవుతుంది. విజయదశమికి విడుదల చేస్తారు.
ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ "శ్రీమంతుడు వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా ఇది.
'శ్రీమంతుడు' కంటే పవర్‌ఫుల్ కథతో తీస్తున్నాం. ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచేవిధంగా ఉంటుంది. ఇందులో మహేష్ ఇంతవరకు పోషించనటువంటి క్యారక్టర్‌లో కనిపిస్తారు. హీరోయిన్ ఎవరనేది త్వరలో వెల్లడిస్తాం. రవి కె.చంద్రన్, దేవిశ్రీప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. చాలా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు" అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ "మహేష్‌బాబుతో ఒక సంచలనం చిత్రం చేయాలనేది నా చిరకాల కోరిక. అది ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. వరుస విజయాలు అందిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేవిధంగా ఈ చిత్రం ఉంటుంది" అని అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ "వరుసగా కొరటాల శివగారి సినిమాలన్నీ చేయడం ఆనందంగా ఉంది. 'శ్రీమంతుడు' ఆడియో పెద్ద హిట్ అయింది. ఇది దానికంటే పెద్ద కథాచిత్రం. శ్రీమంతుడి కంటే పెద్ద హిట్ అవుతుంది" అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ మాట్లాడుతూ "మూడేళ్ళ క్రితం ట్విట్టర్‌లో నా అభిమాన హీరో మహేష్ అని ట్వీట్ చేశాను. ఇప్పుడు మహేష్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. టెక్నికల్‌గా ఈ సినిమా హై రేంజ్‌లో ఉంటుంది "అని చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







