కేంద్ర తీసుకున్న నిర్ణయంతో సినిమా వాయిదా..?
- November 10, 2016
500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీరంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టగా ఈ వారం రిలీజ్ కావాల్సిన సినిమాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవటంతో ఎంత మంది థియేటర్ల వరకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.దీంతో చేసేదేమి లేక తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు అల్లరి నరేష్. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ముందుగా ఈ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించారు.తరువాత ఒక్క రోజు ఆలస్యంగా శనివారం విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారం పాటు వాయిదా వేసి వచ్చే శుక్రవారం (నవంబర్ 18న) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







