భారత కరెన్సీ మార్పిడి - మీరేం చెయ్యాలి?
- November 11, 2016
భారత ప్రధాని నరేంద్రమోడీ 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్ల వినియోగంపై ప్రకటన చేసిన వెంటనే భారతదేశంలోనివారే కాకుండా, విదేశాల్లోనివారు కూడా షాక్‌కి గురయ్యారు. అయితే ఆర్బిఐ పాత నోట్ల మార్పిడికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇది విదేశాల్లోని భారతీయులకూ వర్తిస్తుంది. విదేశాల్లోని భారతీయ బ్యాంకులు రద్దు చేయబడిన పాత నోట్లను స్వీకరించాల్సి ఉంటుంది ఆర్బిఐ గైడ్ డైన్స్ ప్రకారం. కాబట్టి ఆ పాత నోట్లు ఉన్నవారు భారతీయ బ్యాంకులకు వెళ్ళి మార్చుకుంటే సరిపోతుంది. డిసెంబర్ 30 లోపు ఇండియా వెళ్ళాలనుకుంటే సమస్యే లేదు, వెళ్ళిన తర్వాత వాటిని మార్చుకోవచ్చు. మీరు వెళ్ళని పక్షంలో మీ స్నేహితులకు మీ వద్ద ఉన్న పాత నోట్లను ఇచ్చి వారు ఇండియాకి వెళితే మార్పించుకోవచ్చు. డిసెంబర్ 30 తర్వాత గనుక మీరు ఇండియాకి వెళితే ఆర్బిఐలో పాత నోట్లను మార్చుకునే అవకాశం కూడా ఉంది. డిపాజిట్ చేయడానికి పరిమితుల్లేవుగానీ, నోట్లను మార్చుకోడానికి మాత్రం కేవలం 4 వేల వరకే అనుమతినిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







