అమ్నెస్టీని వినియోగించుకోవాల్సిందిగా ఇండియన్ ఎంబసీ సూచన
- November 11, 2016
ఇండియన్ అంబాసిడర్ పి.కుమరన్, అక్రమ నివాసితులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహిస్తోన్న అమ్నెస్టీని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూడు నెలల అమ్నెస్టీని సెప్టెంబర్ 2న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్రమ నివాసితులు ఖతార్‌ని విడిచిపెట్టాల్సి ఉంది. ఈ స్కీమ్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. అమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఇండియన్ ఎంబసీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని కుమరన్ ప్రెస్మీట్లో చెప్పారు. ఇప్పటిదాకా 1,500 మంది భారతీయులు అమ్నెస్టీని వినియోగించుకున్నారనీ, ఇందులో 150 మందికి పాస్‌పోర్టులు లేవన్నారు. అవసరమైనవారందరికీ ఎంబసీ అత్యవసర పాసుల్ని మంజూరు చేసిందన్నారు. ఎమర్జన్సీ పాసుల కోసం వసూలు చేయాల్సిన 60 ఖతారీ రియాల్స్‌ని మినహాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు. అలాగే 500, 1000 రూపాయల నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా, అలాంటి నోట్ల విషయమై ఖతార్లోనివారికి సమాచారం ఇచ్చేందుకుగాను భారత ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ కోసం ఎదురుచూస్తోంది ఎంబసీ.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







