మలయాళ నటి రేఖ మోహన్ అనుమానాస్పద మృతి
- November 13, 2016
మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. శనివారం కేరళలో త్రిసూర్ లోని రేఖ అపార్ట్ మెంట్ లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. రేఖ మృతికి కారణమేంటన్నది తెలియరాలేదు. పోలీసులు ఈ కోణంలో విచారణ చేస్తున్నారు. ఆమె పలు మలయాళీ సినిమాలు, టీవీ సీరియల్ లో నటించింది.
ఇంటికి దూరంగా ఉన్న రేఖ భర్త గత రెండు రోజులుగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆయనకు సందేహం వచ్చి త్రిసూర్ పోలీసుల సాయం కోరాడు. పోలీసులు రేఖ అపార్ట్ మెంట్ కు వెళ్లి తలుపులు పగలకొట్టి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. అపార్ట్ మెంట్ లోపల లాక్ చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలోనూ రెండు రోజుల క్రితం ఇలాగే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నటి సబర్ణ చైన్నైలోని తన ఫ్లాట్ లో మరణించినట్టు పోలీసులు కనుగొన్నారు. మూడు రోజుల క్రితం చనిపోయినట్టు తెలిపారు. ఆమె లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







