నెహ్రూకి ఘన నివాళి
- November 13, 2016
భారత తొలి ప్రధానిమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 127వ జయంతి సందర్భంగా జాతి యావత్తు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వన్ వద్దకు చేరుకుని తొలి ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా నెహ్రూ సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాంతి వన్ వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. 1889, నవంబర్ 14న అలహాబాద్ లో జన్మించిన జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1964 వరకు తొలి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. నెహ్రూ జయంతిని జాతీయ బాలల దినోత్సవంగానూ జరుపుకొంటారని తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







