సత్యానంద్ మొదటి సారిగా 'నేత్రా'చిత్రంలో...
- November 14, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నటులను తయారు చేసిన సత్యానంద్ మొదటి సారిగా 'నేత్రా'చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రంతో ఆయన వారసుడు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్‌లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం 'నేత్ర'.ఉదయ్ నాగ్ రతన్ దాస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో మ్యాంగో ఆడియో ద్వారా మార్కెట్ లోకి హైదరాబాద్ లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటులు, `మా` అధ్యక్షులు డా.రాజేంద్రప్రసాద్ తొలి సీడీ ఆవిష్కరించి స్టార్ మేకర్ సత్యానంద్ కు అందజేశారు.ట్రైలర్ చూశాక సినిమా చూడాలన్న క్యూరియాసిటీ కలిగింది.కచ్చితంగా చూస్తాను. దర్శకుడు మాటలు, చూసిన ప్రోమోస్ ను బట్టి ప్రతిభాశాలి అని అర్థమవుతోంది. సత్యానంద్ శిష్యులు, ఆయనకు బాగా కావాల్సిన వారంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించాలనీ ఆశిస్తూ...యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు `` అని తెలిపారు.ఈ చిత్రంలో గోపిచరణ్, ఐశ్వర్య హీరో హీరోయిన్‌లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్ సత్యానంద్, ఐకె త్రినాధ్, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్ చరణ్, తిరుమలరెడ్డి, జబర్దస్త్ అప్పారావు, జనార్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్ రతన్‌దాస్, మాటలు: ప్రసాదుల మధుబాబు, కెమెరా: ఎస్.వి. గోపాల్, ఎడిటింగ్: నర్సింగ్ రాధోడ్, కొరియోగ్రఫి: లుక్స్ రాజశేఖర్, బాలకృష్ణ, ఫైట్స్: బాజీరావు, నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









