గిన్నీస్‌బుక్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నా భారతీయుడు ..

- November 14, 2016 , by Maagulf
గిన్నీస్‌బుక్‌  రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నా భారతీయుడు ..

దుబాయ్‌లో స్థిరపడ్డ భారతీయుడు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు. శరణార్థ చిన్నారులకోసం కేవలం ఒక్క రోజులో 10,975 కేజీల స్టేషనరీని సేకరించి రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది శరణార్థ చిన్నారులకు పంచిపెట్టేందుకు అతడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని తిరునవ్వేలిలో జన్మించిన కృష్ణమూర్తి 1992 నుంచి దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కృష్ణమూర్తి 'ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌' అనే ఒక స్వచ్చంధ సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా విద్యార్థుల వద్ద నుంచి పుస్తకాలు, బొమ్మలు, స్టేషనరీ వంటివి సేకరించి భారత్‌, ఆఫ్రికాలోని పేద పిల్లలకు పంచిపెడుతున్నారు.ఈ క్రమంలో ప్రపంచంలోని శరణార్థ చిన్నారులకు అందించేందుకు ఆయన స్టేషనరీని సేకరించే కార్యక్రమం ప్రాంభించారు. కార్యక్రమంలో భాగంగానే ఒక్క రోజులో 10,975 కేజీల స్టేషనరీని సేకరించి గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.సంస్థకు చెందిన 400 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని 50,000 నోటు పుస్తకాలు, 3లక్షల పెన్సిళ్లు, 2,000 బ్యాగులు సేకరించారు. 2015లో సౌదీ అరేబియాలో సేకరించిన 4,571 కేజీలు స్టేషనరీ రికార్డును కృష్ణమూర్తి బద్దలు చేశారు. ఎమరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌ సంస్థ వీటిని శరణార్థులకు అందించేందుకు ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ' చిన్నారులకు ఆనందాన్ని అందివ్వడమే సంస్థ ఉద్దేశం. ప్రంపచంలో ఎన్నో అవసరాలు కలిగిన ఉన్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు మా ప్రయత్నం' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com