బాలయ్యతో డేట్స్ కుదరని అమితాబ్ ...

- November 14, 2016 , by Maagulf
బాలయ్యతో  డేట్స్ కుదరని  అమితాబ్ ...

బాలకృష్ణ తన 100వ చిత్రం క్రిష్ డైరెక్షన్‌లో 'గౌతమీపుత్ర శాతకర్ణి'గా తెరకెక్కుతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న టీమ్ గ్రాఫిక్స్ వర్క్‌లో ఉంది. బాలయ్య తన 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' తెరకెక్కనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన సన్నాహాల్లో కృష్ణవంశీ బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను అమితాబ్ తో చేయిస్తే బావుంటుందని భావించిన బాలకృష్ణ - కృష్ణవంశీ ఈ మధ్యే ముంబై వెళ్లి ఆయనని కలుసుకున్నారు. ఈ సినిమా కథ .. ఆయన పాత్రను గురించి అమితాబ్ కు చెప్పగా, ఆయన డేట్స్ చూసి ఏ విషయం చెబుతానని అన్నారట. వచ్చే ఏడాది జూలై వరకూ డేట్స్ కుదరడం లేదని, అప్పుడు కూడా సర్దుబాటు చేసుకుని ఇవ్వగలనని చెప్పారనేది తాజా సమాచారం.దాంతో ఆ పాత్రకి మరో నటుడిని ఎంపిక చేసుకునే ఆలోచనలో దర్శకనిర్మాతలు వున్నారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com