దుఖాన్ సౌత్ సర్వీస్‌రోడ్‌పై ఏడాదిపాటు ట్రాఫిక్ డైవర్షన్
- November 16, 2016
దుఖాన్ సౌత్ సర్వీస్ రోడ్ (డిఎస్‌ఎస్‌ఆర్)పై రెండు కిలోమీటర్ల సెక్షన్ నవంబర్ 18 నుంచి ఏడాదిపాటు మూసివేయబడుతుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ని మళ్ళింపుల ద్వారా క్రమబద్ధీకరిస్తారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి న్యూ ఆర్బిటల్ హైవే మరియు ట్రక్ రూట్ కోసం బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఈ క్లోజర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అష్గల్, ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ని దహిలియాత్ ఇంటర్‌ఛేంజ్ వైపు మళ్ళిస్తున్నట్లు ప్రకటించింది. వాహనాల వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లుగా నిర్ణయించి, వాహనాలకు అనుమతినిస్తారు ఈ మళ్ళిపులో. దుఖాన్ నుంచి దోహా వైపు వెళ్ళేవారు దహిలియాత్ ఇంటర్చేంజ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. దోహా నుంచి డిఎస్‌ఎస్‌ఆర్ మీదుగా దుఖాన్ వెళ్ళేవారు టెంపరరీ ట్రక్ రూట్‌పై రౌండెబౌట్ వద్ద రైట్ టర్న్ తీసుకుని, నార్త్ ఈస్ట్ డైరెక్షన్‌లో వాహనాలు వెళ్ళాల్సి ఉంటుంది. వాహన మళ్ళింపులకు సంబంధించి మ్యాప్‌ని రిలీజ్ చేసిన అష్గల్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాహనదారులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







