నలుగురిలో ముగ్గురు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడేవారే
- November 16, 2016
అబుదాబీ: వాహనాలు నడిపే ప్రతి నలుగురిలో ముగ్గురు ఏదో ఒక రకంగా వాహనాన్ని నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్‌ని ఉపయోగించేవారని ఓ సర్వే వెల్లడించింది. 1033 మోటరిస్టుల్లో 26 శాతం మంది మాత్రమే వాహనం నడుపుతున్న సమయంలో ఫోన్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించడంలేదని చెప్పారు. అయితే వాహనాలు నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం చట్టరీత్యా నేరమని అబుదాబీ పోలీసులు చెబుతున్నారు. 200 దిర్హామ్‌ల ఫైన్తోపాటుగా 4 బ్లాక్ పాయింట్స్ ఈ నేరానికిగాను విధిస్తారు. రోడ్లపై ఈ తరహా నిబంధనల ఉల్లంఘనల్ని గుర్తించడం ఛాలెంజింగ్‌గా మారుతోందని, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల ఆలోచనల్లో మార్పులు రావడంలేదని అబుదాబీట్రాఫిక్ పోలీస్ కల్నల్ జమాల్ అల్ అమెరి చెప్పారు. ఇదొక బ్యాడ్ హ్యాబిట్ అనీ, సేఫ్ జర్నీ కోసమే ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారనీ, వాహనదారులు పోలీసులతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్లు వంటి వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డివైజెస్ ఉండటంతో 75 శాతం మంది వాటిని వినియోగిస్తున్నారు. అది కూడా ప్రమాదకరమేనని పోలీసులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







