నాగ్ పోలీస్ పాత్రలో...
- November 17, 2016
రొటీన్ చిత్రాలకు కాలం చెల్లింది. దాంతో యువ కథానాయకులే కాదు సీనియర్ హీరోలు సైతం తమకు సరిపోయే విభిన్న కథలు, పాత్రలనే ఎంచుకుంటున్నారు. 'మనం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి' వంటి విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నాగార్జున తాజాగా 'ఓం నమో వేంకటేశాయ' అనే భక్తిరస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం చేస్తే బావుంటుందని ఆయన భావిస్తున్నారట. కార్తికేయ, ప్రేమమ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాగ్ కలయికలో సినిమా చేస్తే తన స్ధాయి మరింత పెరుగుతుందని చందు ఉవ్విళ్లూరుతున్నారట.వీరి కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం కోసం చందు ఓ మంచి పోలీస్ కథను సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన లైన్ చెప్పి నాగ్ చేత అంగీకరింపజేసుకున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. చాలాకాలం తర్వాత నాగ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారన్నమాట.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







