ఎయిర్ లైన్స్ సంస్థ అందించిన భోజనంలో బొద్దింక
- November 17, 2016
ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ ప్యాసింజర్‌కు ఎయిర్ లైన్స్ అందించిన భోజనంలో బొద్దింక ప్రత్యక్షం అయింది. చికాగో వెళుతున్న ఓ ప్రయాణికుడు తనకు ఎయిర్ లైన్స్ సంస్థ అందించిన భోజనంలో బొద్దింక ఉందని దాని ఫోటోలతో ట్విట్టర్లో పోస్టు చేశారు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం బొద్దింకలతో కూడిన శాకాహార భోజనం పెడుతుందని.. దీనివల్ల అనారోగ్యం పాలయ్యానని రాహుల్ రఘువంశీ అనే యువకుడు ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. అయితే ఆహారంలో బొద్దింక వ్యవహారం చినికి చినికి గాలివానలా మారకముందే..
ఈ ఘటనతో అసౌకర్యం కలిగిన ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. విమానంలో భోజనం అందించిన కేటరింగ్ సంస్థకు నోటీసు జారీ చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని ఎయిర్ లైన్స్ సీనియర్ మేనేజరు ధనుంజయ్ కుమార్ తెలిపారు. దీనిపై తాము బేషరతుగా క్షమాపణలు చెపుతున్నామని.. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







