46వ జాతీయ దినోత్సవ ప్రత్యేకతలివే
- November 17, 2016
మస్కట్: 46వ జాతీయ దినోత్సవం సందర్బంగా వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్ట్రీట్స్‌లో ఈ నెలాఖరు వరకు అత్యద్భుతమైన లైటింగ్ కనువిందు చేయనుంది. అలాగే ఫ్లాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆకాశంలో ఫైర్ వర్క్స్‌తో అద్భుతాలు అందర్నీ అలరించనున్నాయని నేషనల్ డే సెలబ్రేషన్స్ - సుప్రీం కమిటీ ప్రతినిథులు చెప్పారు. ఇంకో వైపున అల్ బుస్తాన్ నుంచి బైట్ అల్ బఆకా రౌండెబౌట్ వరకూ అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మస్కట్‌లోని రాయల్ ఒపేరా హౌస్ వద్ద స్ట్రీట్ అంతటా మ్యూజికల్ నోట్స్, గ్లోయింగ్ గిటార్‌ని ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు యూనిక్‌గా ఆలోచించామని అధికారులు చెప్పారు. అమీరత్ మరియు సీబ్‌లలో 30 నిమిషాలపాటు ఫైర్ వర్క్స్ నభూతోనభవిష్యతి అనేలా ఉంబోతున్నాయట. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఫైర్ వర్క్స్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఫైర్ వర్క్‌కి సంబంధించి సివిల్ యావిఏషన్ వర్గాలకు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







