వ్యభిచారం అరికట్టేందుకు పర్యాటక వీసా ఒమన్ నియమాలు ఇక కఠినతరం
- November 17, 2016
మస్కట్ : వ్యభిచారంని దేశం నుంచి తరిమికొట్టాలని చర్యలలో భాగంగా, ఒమన్ లో ఈ నెల నుండి ఆగ్నేయ ఆసియా నుండి ఇక్కడకు వచ్చే మహిళలకు పర్యాటక వీసాలు మంజూరు చేయడంలో కఠినమైన ఆంక్షలు అమలు చేయనున్నారు. పర్యాటక వీసాలపై దేశంలోనికి ప్రవేశించిన పలువురు ఆ ప్రాంత స్త్రీలు వ్యభిచారంకు పాల్పడుతున్న చర్యలు క్రమేపి పెరుగుతుండటంని గుర్తించిన పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. ఇమ్మిగ్రేషన్ శాఖ రాయల్ ఒమన్ పోలీస్ (రోప్ ) సూచన మేరకు ఇప్పుడు ఒక రౌండ్ ట్రిప్ టికెట్ మరియు ఒక నాలుగు నక్షత్రాల హోటల్ బుకింగ్ రిజర్వేషన్లు అవసరం.ఒక స్త్రీ కు ఇపుడు 10 రోజుల పర్యాటక వీసా మాత్రమే మంజూరు చేస్తుంది. ప్రస్తుత పర్యాటక వీసా 30 రోజులు కాగా ఆ స్త్రీ మరొక పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేయాలనుకొంటే ఒక నెల దేశం నుంచి వదిలి వెళ్లాల్సి ఉంటుంది.ఆగ్నేయ ఆసియా దేశాలకు చెందిన వందలాది మహిళలను గతంలో వ్యభిచారం కేసులలో ఉన్నకారణంగా అరెస్టు చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఈ సంబంధిత కేసులలో ఉన్న స్త్రీల ఫోటోలను వీడియోలను వీధుల్లో మరియు సోషల్ మీడియాలో రాజధాని మస్కట్ లో ప్రచారం చేయాలని ఒమన్ అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







