ఎమర్జన్సీ క్యాష్ ట్రాన్స్‌ఫర్‌కి కష్టాలు
- November 17, 2016
అబుధాబి: యూఏఈలోని భారతీయ వలసదారులు అత్యవసర పరిస్థితుల్లో తమవారికి డబ్బు పంపించడం చాలా కష్టమవుతోంది. భారతదేశంలోని కలెక్షన్ పాయింట్స్ వద్ద తగిన మొత్తంలో కరెన్సీ నోట్స్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో భారతదేశంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డబ్బులు పంపిస్తున్నా, అది సకాలంలో తమవారికి చేరడంలేదని బాధితులు వాపోతున్నారు. అబ్దుల్ కరీమ్ అనే వ్యక్తి 25,000 రూపాయల్ని ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా పంపించినా, అది చేరాల్సిన చోటుకి చేరలేదు. తన కుమార్తెకి డెలివరీ అయ్యిందనీ, అత్యవసర పరిస్థితుల్లో తాను ఆమె కోసం డబ్బు పంపించానని అబ్దుల్ కరీమ్ వాపోయారు. బ్యాంకుల నుంచి డ్రా చేసుకునే మొత్తానికి కూడా పరిమితి ఉండడంతో ఆసుపత్రిలో చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చిందని ఆయన అన్నారు. వినియోగదారుల సమస్యల పట్ల స్పందించిన ఎక్స్‌ప్రెస్ మనీ సీఓఓ సుదీష్ గిరియాన్, కొద్ది రోజుల్లో ఈ పరిస్థితి సద్దుమణుగుతుందనీ అప్పటివరకూ వినియోగదారుల సమస్యల పట్ల చింతిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







