కామన్వెల్త్ బ్యాంకులో ఓ దుండగుడు చొరబడి బాంబు పేల్చాడు..
- November 17, 2016
ఆస్ట్రేలియాలోని స్ప్రింగ్‌వ్యాలీ ప్రాంతంలోని కామన్వెల్త్ బ్యాంకులో ఓ దుండగుడు చొరబడి బాంబు పేల్చాడు. ఈ ప్రమాదంలో సుమారు 26 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషంగా ఉంది. బ్యాంకులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ వ్యాపించింది. పొగ కారణంగా పలువురికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ప్రమాదానికి కారణమైన దుండగుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.క్షతగాత్రులను తరలించేందుకు 25 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు వివరించారు. ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ కమాండర్ పౌల్ హాల్మన్ ఘటనపై స్పందించారు.క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిలో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం బ్యాంకులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న బాంబును పేల్చడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ వ్యాపించిందని.. ఆ ప్రదేశమంతా రక్తంతో తడిసిపోయిందని తెలిపాడు. బ్యాంకు ముఖద్వారం వద్ద ఈ పేలుడు సంభవించిందని వివరించాడు. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది వెంటనే బ్యాంకును మూసివేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







