సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ కొనసాగాలని చరణ్ డిసైడ్...
- November 17, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రాంచరణ్. ఇకపై కూడా ప్రొడ్యూసర్ గా కొనసాగాలని డిసైడ్ అయినట్టు సమాచారమ్. మెగా హీరోలతో కాకుండా బయటి హీరోలతోను చరణ్ సినిమాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.చరణ్-శర్వానంద్ లు బాల్య స్నేహితులు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు చరణ్. దర్శకుడు ఎవరన్నది త్వరలోనే తేలనుంది. ఈ సినిమాతో పాటుగా అఖిల్ అక్కినేని సినిమాని కూడా చరణ్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం అఖిల్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది.ఈ చిత్రం తర్వాత అఖిల్ చేయబోయే చిత్రాన్ని చరణ్ నిర్మించనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.మొత్తానికి.. ఇటు సినిమాలు చేస్తూనే, అటు నిర్మాతగానూ కొనసాగాలని చరణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరీ.. నిర్మాతగా చరణ్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







