ఘటన:సినిమా రివ్యూ
- November 18, 2016
నిత్యామీనన్, క్రిష్ జె.సత్తార్, నరేష్ తదితరులు
సంగీతం: అరవింద్ శంకర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ
నిర్మాత : వి.ఆర్.కృష్ణ ఎం
మలయాళ చిత్రం '22 ఫిమేల్ కొట్టాయం' రీమేక్ గా దర్శకురాలు శ్రీప్రియ తెరకెక్కించిన చిత్రం 'ఘటన'. ఎప్పడో షూటింగ్ కంప్లీట్ అయిన ఎందుకనో విడుదల కాలేదు. ఎట్టకేలకు అన్ని అవాంతరాలు దాటుకొని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మరి ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ : ఓ హస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది మాలిని(నిత్యామీనన్). కెనడా వెళ్లి అక్కడే ఉండాలన్నది ఆమె కోరిక. ఓ వీసా కన్సల్ టెన్సీ కంపెనీ యజమాని ప్రకాష్(నరేష్).
మాలిని వీసా కోసం ప్రకాష్ దగ్గరకు వెలుతుంది. ప్రకాష్ కింద పనిచేసే వరుణ్ తో మాలినికి పరియం ఏర్పడి. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కొన్ని కారణాల వల్ల మాలిని..వరుణ్ లు కలిసే ఉంటారు. ఆ టైంలో వరుణ్ ఓ పెద్ద ప్రమాదంలో పడతాడు. ఆ ప్రమాదం ఏమిటి..? ఆ ప్రమాదం నుంచి వరుణ్ ని మాలిని బయటపడేసిందా..? మాలిని కెనడా వెళ్లిందా.? ప్రకాష్ వల్ల మాలిని ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
బలాలు..బలహీనతలు : సినిమా మొత్తానికి నిత్యామీనన్ నటనే హైలెట్ అని చెప్పవచ్చు. ఇక నరేష్, క్రిష్ జె సత్తార్ వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకురాలు ఎంచుకున్న కథాంశం మంచిదే అయినా దాన్ని ఆసక్తి కరంగా మలచలేకపోవటమే అతి పెద్ద మైనస్. అసలు కథలోకి సినిమా వెళ్లడానికి చాలా టైం తీసుకుంది. ఎంతవరకు అంటే.దాదాపు ముప్పై నిమిషాల పాటు వచ్చే సన్నివేశాలు కూడా ఏమంత బాగోలేవు. ఉన్నతంలో ఇంటర్ వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలు ఒక్కటే ఫర్వాలేదు. సెకండాఫ్ అంతా రివేంజ్ డ్రామాగానే కొనసాగుతుంది. సినిమా మొత్తంలో ప్రేక్షకుడు ఎక్కడా కథకు కనెక్టు కాదు. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంది. సాంకేతిక అంశాలు తీసుకుంటే. అరవింద్ శంకర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించాయి. మనోజ్ పిళ్లై సినిమాటోగ్రఫీ కూడా గొప్పగా లేదు. ఎడిటింగ్ దారుణం. ఎప్పుడో నిర్భయ ఘటన అప్పుడు విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు విడుదల కావడంతో పాత సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
చివరగా : ఆలస్యమైన ఘటన...
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







