డేటావిండ్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- November 18, 2016
సీఎం కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని .. రాష్ట్ర పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ మొబైల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించగా డేటావిండ్ కంపెనీ సైతం ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డేటావిండ్ ఏర్పాటు చేసిన మొబైల్, ట్యాబ్‌లెట్ తయారీ పరిశ్రమను కెనడా రాయబారి నాదిర్‌పటేల్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డేటావిండ్ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.ఇప్పటికే 600 మందికి ఉపాధి లభించిందని.. త్వరలో ఈ సంఖ్య రెట్టింపవుతుందన్నారు. ఏకగవాక్ష విధానం ద్వారా పెట్టుబడి దారులకు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







