మన కంటే ముందు నోట్లను రద్దు చేసిన దేశాలివే!

- November 19, 2016 , by Maagulf
మన  కంటే ముందు నోట్లను రద్దు చేసిన దేశాలివే!

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మోదీ అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశ ప్రజలతో పాటు, విదేశాల దృష్టిని కూడా ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో ఇలా నోట్లను రద్దు చేశారు? అవి ఏఏ దేశాలు? ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకోసం...
1. నైజీరియా: 1984లో నైజీరియాలో ముహ్మదు బుహారి ప్రభుత్వ హయాంలో పాత నోట్లన రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టారు. అయితే ఈ నిర్ణయం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక మాంద్యంతో అల్లాడింది.

2. ఘనా: 1982లో ఘనా దేశంలో 50 సెడిస్ నోటును రద్దు చేశారు. అయితే విచిత్రంగా ఈ నిర్ణయం తర్వాత ఆ దేశ ప్రజలు బ్లాక్‌మార్కెట్‌ను ప్రోత్సహించి, ఆస్తులను కూడగట్టుకున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
3.పాకిస్థాన్: దాయాది దేశం పాకిస్థాన్ కూడా ఈ నోట్ల రద్దుకు మినహాయింపేమీ కాదు. డిసెంబర్ 2016 నుంచి పాకిస్థాన్‌లో కొత్త రకం కరెన్సీ చలామణీలోకి వచ్చింది. రద్దు చేయకపోయినప్పటికీ కొత్త నోట్లు వినియోగంలోకి రావణంతో పాత నోట్లు కాలగర్భంలో కలిసిపోయాయి.
4. జింబాబ్వే: ఈ దేశంలో మొదట్లో ట్రిలియన్ డాలర్ నోటు వినియోగంలో ఉండేది. అప్పట్లో జింబాబ్వే ద్రవోల్భణ సమస్యతో కుదేలైంది. రాబర్ట్ ముగాబే ఆ దేశ అధ్యక్షుడు కాగానే ఆ నోట్లను రద్దు చేశారు. వాటి స్థానంలో 0.5 డాలర్ల తక్కువ విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టారు.
5. నార్త్ కొరియా: 2010లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్- II పాత నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒక్క చర్య వల్ల దేశ ప్రజలంతా తినడానికి తిండి దొరక్క అల్లాడారు. పాత నోట్లపై ఉన్న రెండు సున్నాలను తగ్గిస్తూ వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు.
6. సోవియట్ యూనియన్: మిఖాలి గార్బచేవ్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నల్ల ధన నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
7. ఆస్ట్రేలియా: ప్రపంచ కరెన్సీలో ఓ నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన దేశం ఆస్ట్రేలియా. ప్లాస్టిక్ కరెన్సీని అమలులోకి తెచ్చిన మొదటి దేశం ఆస్ట్రేలియా. ఫేక్ కరెన్సీని అరికట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో సంచలనమైంది. అయితే ఈ నోట్లు ప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకపోవడం హర్షించదగ్గ విషయం.
8. మయన్మార్: 1987లో బ్లాక్‌మనీని నియంత్రించడానికి అక్కడి మిలటరీ నోటు విలువను దాదాపు 80శాతం తగ్గించింది. దీనివల్ల ఆ దేశం ఆర్థిక స్థితి పతనావస్థకు చేరింది. డబ్బు కోసం ఒకరినొకరు కొట్టుకుని చాలామంది ప్రజలు చావుకు కారణమైంది.
అయితే నోట్ల రద్దు తర్వాత ఈ దేశాలు ఎదుర్కొన్న పరిస్థితులను, మన దేశ ఆర్థిక వ్యవస్థను పోల్చి చూడలేం. పైన పేర్కొన్న దేశాల్లో ప్రజాస్వామ్య విధానం కలిగిన దేశాలు తక్కువే ఉన్నాయి. అందుకే అక్కడ నోట్లను రద్దు చేయగానే ప్రజలు నానా అవస్థలు పడాల్సొచ్చింది. ఆర్థిక మాంద్యం తాండవించింది. కానీ మన దేశం అందుకు పూర్తి భిన్నం. నోట్ల రద్దు వల్ల మన ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com