'ఏజెంట్ 007' గా రానున్న మహేష్
- November 19, 2016
స్టార్ హీరోల సినిమాలకు కథలే కాదు టైటిల్స్ దొరకడం కూడా కష్టమైపోతోంది. పేరులో ఏముంది ఏదో ఒకటి పెడదాం అంటే ఇమేజ్ అడ్డొస్తుంటుంది. స్టార్ హీరో చిత్రానికి ఇంత సాదాసీదా టైటిల్ పెడతారా అంటూ ప్రశ్నిస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు కొత్త సినిమాకు పేరు పెట్టే విషయంలోనూ యూనిట్ ఇలాంటి తర్జనభర్జనలే పడుతోంది. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
అయినా పేరు నిర్ణయించలేదు. కథ ప్రకారం హీరో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కాబట్టి 'ఏజెంట్ శివ','ఏజెంట్ 007' అనే రెండు పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో 'ఏజెంట్ 007' ను ఖరారు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తదుపరి చిత్రీకరణ కోసం నవంబర్ 24 నుంచి అహ్మదాబాద్ వెళ్లనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!