పట్టాలు తప్పిన పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్, 63 మంది మృతి
- November 19, 2016
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పాట్నా - ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 63 మందికి పైగా దుర్మరణం చెందారని తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. ప్రయాణీకులంతా గాఢనిద్రలో ఉండగా మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం తెలియడంతో అధికారులు సంఘటన స్థలం చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సహాయంతో బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. రైలు ప్రయాణించే మార్గంలోని ప్రధాన స్టేషన్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. మెడికల్ టీం కూడా సంఘటన స్థలానికి చేరుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
హెల్ప్‌లైన్ నెంబర్లు: ఝాన్సీ - 05101072, ఒరాయ్ - 051621072, కాన్పూర్ -05121072, పోక్రయాన్-05113-270239.
రైల్వేస్ అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా మాట్లాడుతూ... మృతుల సంఖ్య గుర్తించవలసి ఉందని చెప్పారు. మెడికల్, రెస్క్యూ టీంలు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్నాయని చెప్పారు. 20 మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ.. ప్రమాదానికి బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో పలువురి మృతి బాధించిందన్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్ని ఆసుపత్రులకు సహాయ సహకారాలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







