దుబాయ్ లో 'యూత్ ఐకన్ పురస్కారం' అందుకున్న రామ్ చరణ్
- November 20, 2016
సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువతరానికి మలయాళ పరిశ్రమ ఆసియా విజన్ -2016 పేరిట యూత్ ఐకన్ పురస్కారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కమిటీ టాలీవుడ్ నుంచి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసుకోవడం విశేషం. తనదైన ఛరిష్మాతో వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్న స్టార్ హీరో చరణ్‌కి కోట్లాది ప్రేక్షకాభిమానుల ఫాలోయింగ్ ఉంది. యువతరానికి స్ఫూర్తినిచ్చే అసాధారణ విజయాలు ఈ యువహీరో సొంతం.
తన రెండో సినిమా(మగధీర)కే బాక్సాఫీస్ వద్ద 70 కోట్లు పైగా వసూళ్లు సునాయాసంగా రాబట్టిన హీరో చరణ్. అందుకే అతడి ప్రతిభకు చక్కని గుర్తింపు దక్కింది. ఇటీవల షార్జా స్టేడియం(యుఏఈ )లో జరిగిన ఆసియా విజన్ -2016 వేడుకల్లో రామ్ చరణ్ కి అత్యున్నత యూత్ ఐకన్ పురస్కారం అందించారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.
దుబాయ్‌లో ప్రతియేటా నిర్వహించే అతి పెద్ద మలయాళ అవార్డుల కార్యక్రమం ఇది. 2006 నుంచి ఈ పురస్కారాల్ని అందిస్తున్నారు. అక్కడికి రామ్ చరణ్ వెళ్లి ఈ అవార్డ్ ని అందుకున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన `ధృవ` అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తను నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ధృవ. సురేందర్‌రెడ్డి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజా పరిస్థితుల కారణంగా విడుదల తేదీని వారం పొడిగించి డిసెంబర్ 9కి మార్చారు.
నీతి నిజాయితీలకు కట్టుబడే పోలీస్ అధికారి ధృవకు వృత్తి నిర్వహణలో కొందరు శుత్రువులు ఎదురవుతారు. వారు ఎవరు? ధృవ వారిపై ఎలాంటి పోరాటం సాగించాడు? అనేది ఈ చిత్ర ఇతివృత్తం. సమాజంలో మంచివాడిగా చెలామణి అవుతోన్న అవినీతిపరుడిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంలో విజయవంతమైన తని ఒరువన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరవింద్‌స్వామి విలన్‌గా కనిపిస్తారు.
ఇటీవలే విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. రామ్‌చరణ్ పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:పి.యస్.వినోద్, సంగీతం:హిప్, హాప్ తమిళ, ప్రొడక్షన్ డిజైనర్:రాజీవన్, ఆర్ట్:నాగేంద్ర, ఎడిటర్:నవీన్‌నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:వి.వై.ప్రవీణ్‌కుమార్.

![]()
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









