గోవాలో 'ఫిలిం ఫెస్టివల్' ప్రారంభం
- November 20, 2016
గోవాలోని పనాజీలో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. యూపీలో జరిగిన పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్రమాద మృతులకు కార్యక్రమ ప్రారంభోత్సవంలో నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమ ప్రాంగణమంతా దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించే విధంగా తయారు చేశారు. ఆవరణలో ఇరువైపు ఏర్పాటు చేసిన త్రీడీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ కళాకారుడు మరియా మిరండా ఈ త్రీడీ కటౌట్లను తయారుచేశారు.తొమ్మిది రోజుల పాటు సాగనున్న ఈ చిత్రోత్సవం ఈనెల 28న ముగియనుంది. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను అలరించేందుకు 21వ తేదీ నుంచి ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటలకు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం ప్రదర్శించనున్నారు. సైరాట్, నటసామ్రాట్, మగధీర, బాజీరావ్ మస్తానీ, సుల్తాన్, ఎయిర్‌లిఫ్ట్, షోలే చిత్రాలను మిర్మర్ బీచ్ ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్ మీద ప్రదర్శిస్తారు.
దేశవిదేశాల నుంచి సినీ ఔత్సాహికులు ఈ చిత్రోత్సవానికి హాజరవుతారు. దాదాపు 90 దేశాలకు చెందిన 200 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







