నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం భారీ ఎత్తున ఎదురు దాడులు..

- November 23, 2016 , by Maagulf
నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం భారీ ఎత్తున ఎదురు దాడులు..

నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం భారీ ఎత్తున ఎదురు దాడులు చేపట్టింది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌, రాజౌరి, ఖేల్‌, మచ్చిల్‌ ప్రాంతాల్లో సైన్యం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ముగ్గురు జవాన్లను బలిగొన్న పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పూంఛ్‌లోని బాలకోట్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు జరుపుతోంది. వాళ్లు చేసిన పిరికి చర్యలపై ప్రతీకారం భయంకరంగా ఉంటుందని ఆర్మీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. .మచ్చిల్‌ సెక్టార్‌లో మరోసారి మెరుపుదాడులకు పాల్పడేందుకు పాక్‌ సైన్యం సిద్ధంగా ఉందని, భారత స్థావరాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నారని, అయితే భారత భద్రతా సిబ్బంది అప్రమత్తంగా, ఎదురుదాడులకు సిద్ధంగా ఉన్నారని సైన్యం పేర్కొంది.మంగళవారం నియంత్రణ రేఖ వెంబడి మచ్చిల్‌ సెక్టార్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com