సినిమా రివ్యూ : రెమో
- November 25, 2016
నటీనటులు : శివ కార్తికేయన్, కీర్తి సురేష్
సంగీతం : అనిరుద్ రవిచందర్
దర్శకత్వం : బక్కియరాజ్ కన్నన్
నిర్మాత : ఆర్.డి. రాజా
విడుదల తేదీ : 25 నవంబర్ 2016
శివ కార్తికేయన్..కీర్తి సురేష్ లు నటించిన రెమో చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని రెమో పేరుతో విడుదల చేశాడు. మరీ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న అ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించిందో లేదో చూద్దాం.
కథ : స్టార్ హీరో కావాలని కలలు కంటుంటాడు శివ(శివకార్తీకేయన్) . ఇంతలో కావ్య(కీర్తి సురేష్) చూసి ప్రేమలో పడతాడు.
అయితే అప్పటికే కావ్యకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం అవుతుంది. ఇక ఎలాగైన కావ్యను ప్రేమలో దించి పెళ్లి చేసుకోవాలని బావించి లేడి నర్సు గెటప్ లో కావ్యకు దగ్గరవుతాడు శివ. తను అనుకున్నట్లు కావ్య ప్రేమను శివ పొందాడా..? ఆమె పెళ్లిని ఎలా చెడగొట్టాడు..? లేడి నర్సు గెటప్ లో అతను పడిన ఇబ్బందులు ఏమిటీ.? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
బలాలు..బలహీనతలు : ఈ సినిమా మొత్తంలో శివకార్తీకేయన్ నటనే పెద్ద ఫ్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. లేడి నర్సు గెటప్ లో అతని నటన ఆకట్టుకుంది. కీర్తి సురేష్..శివకార్తికేయన్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక హీరో హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం సినిమాకే పెద్ద హైలెట్. కీర్తి సురేష్ తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఫస్టాప్ తో పోల్చితే సెకండాప్ చాలా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ఒక్క పాట తప్ప మిగిలిన పాటలు ఆకట్టుకోవు. తెలుగు నేటివిటీ పూర్తిగా మిస్సవడం.కథనం, సన్నివేశాల చిత్రీకరణ, పాత్రల సంభాషణ, ప్రవర్తన ఏవీ కూడా తెలుగుదనానికి దగ్గరగా లేకపోవడం కూడా ఎక్కడో ప్రేక్షకుడికి అసంతృప్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది పిసి శ్రీ రామ్ సినిమాటోగ్రఫీ గురించి. ఆయన ప్రతి సన్నివేశాన్ని కలర్ ఫుల్ గా అందంగా తీర్చిదిద్దారు. దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ నటీనటుల నుంచి కావాల్సిన నటనను రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఆర్. డి. రాజా నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : రెమో -తంబీలకు మాత్రమే
రేటింగ్ః 1.5/5
తాజా వార్తలు
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం









