పంజాబ్లోని బఠిండాలో ఎయిమ్స్ భవనానికి ప్రధాని శంకుస్థాపన
- November 25, 2016
పంజాబ్లోని బఠిండాలో ఎయిమ్స్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాల వికాసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న ప్రధాని.. రహదారులు, విమానాశ్రయాలు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యున్నత ప్రమాణాలు గల పాఠశాలలు ఆస్పత్రులు మనకు అవసరమని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాదని.. తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఏ దైశమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు కల్పనే ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా లక్షితదాడుల్లో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు.పాకిస్థాన్లోని పెషావర్లో దాడి జరిగితే భారతీయులంతా బాధ పడతారని చెప్పారు. అవినీతి, నకిలీనోట్లుపై పోరాడాలని ప్రజలు వారి పాలకులకు చెప్పాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







